KNR: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జ్యోతిష్మతి కాలేజీ యాజమాన్యం కబ్జా చేసిన అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్కు వినతిపత్రం సమర్పిస్తూ, అధికారులు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని అన్నారు.