ATP: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఎస్ఓ మంజుల సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో అథ్లెటిక్స్, ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, పవర్ లిఫ్టింగ్, ఫెన్సింగ్ పోటీలు ఉంటాయన్నారు.