MDK: జిల్లాలో మహిళలకు వడ్డీ లేని రుణాల వడ్డీ డబ్బులను రూ. 8.80 కోట్లు ఈరోజు విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,37,438 మంది స్వయం సహాయక బృందాల సభ్యులలో అర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాల వడ్డీ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.