MHBD: మహబూబాబాద్ ఎస్పీగా డా.శబరీష్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్‌ను ఎస్పీ శబరీష్ ఐపీఏస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకే అందజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇరువురు చర్చించారు.