NLG: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి వినతులు విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.