HNK: శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HNKకు చెందిన దుర్గాప్రసాద్ (30) హైదరాబాద్ వెళ్లి హన్మకొండకు తిరిగి వస్తుండగా.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సీట్‌బెల్ట్ లాక్ అయి బయటకు రాలేకపోవడంతో సజీవదహనమై మృతి చెందాడు. వ్యాపార పనుల నిమిత్తం HYDకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.