ASR: కొయ్యూరు మండలం కొత్తపల్లికి చెందిన సరమండ లక్ష్మి అనే మహిళకు కలెక్టర్ దినేష్ కుమార్ చేయూతనందించారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న బాధితురాలికి, ఆమెకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో సోమవారం కలెక్టర్, కలెక్టరేట్ ఆవరణలో స్వయంగా కుట్టు మిషన్ అందజేశారు. లక్ష్మికి కుట్టు మిషన్ ఇవ్వడం ద్వారా ఆమె ఆర్థికంగా కొంత స్థిరపడటానికి అవకాశం కలుగుతుందన్నారు.