TG: మరోసారి భూముల వేలానికి HMDA సిద్ధమైంది. కోకాపేట నియోపోలిస్లో 41 ఎకరాల విస్తీర్ణంలోని 6 ప్లాట్లను వేలం వేయనుంది. ఈ రోజు నిర్వహించే వేలంలో ప్లాట్లు అమ్ముడుకాకపోతే ఈ నెల 28, అలాగే డిసెంబర్ 3న మరోసారి వేలం నిర్వహించనుంది. కాగా వేలానికి ఉంచిన 41 ఎకరాల్లో.. ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ఆఫ్సెట్ ధరను నిర్ణయించింది.