MHBD: జిల్లాలోని 482 పంచాయతీలు, 4,110 వార్డులకు 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించి ఎస్ఈసీకి పంపినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మొదటి దశలో 155 పంచాయతీలు, రెండో దశలో 158, మూడో దశలో 169 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ వివరించారు.