సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని శనివారం సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర ప్రముఖులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.