VZM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్. జవహర్ విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా గజపతినగరం సాంఘిక సంక్షేమ ఫ్రీ మెట్రిక్ వసతి గృహాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వసతి గృహంలో అందిస్తున్న సేవలపై వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఆనంతరం విద్యార్థులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.