కోనసీమ: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీన మలికిపురం మండలంలో పర్యటించనున్నారు. శంకరగుప్తం ట్రైన్ వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించనున్నారు. రూ.3.21 కోట్లతో ములికిపల్లి-కాటన్ పాడు రోడ్డు, రూ.5 కోట్లతో గుడిమెల్లంక వాటర్ స్కీం ఫిల్టర్, రూ.7.54 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంక్, రూ.11.41 కోట్లతో 117 రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.