ప్రకాశం: జిల్లాలోని దివ్యాంగుల సౌలభ్యం కోసం ఉచితంగా త్రీ వీలర్ బైక్ అందించనున్నట్లు దివ్యాంగ, వృద్ధుల జిల్లా సహాయ సంచాలకురాలు సువార్త తెలిపారు. త్రీ వీలర్ పొందేందుకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ఇవ్వాలన్నారు. ఈ నెల 25లోగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుందని ఆమె తెలిపారు. అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.