KRNL: తుగ్గలి మండలం లింగనేని దొడ్డిలో ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమంగా రిజిస్టర్ చేసుకుని భూ కబ్జాకు పాల్పడ్డారని గ్రామ పెద్ద రామాంజనేయులు అన్నారు. కబ్జాకు పాల్పడ్డ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూకబ్జాకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.