కిచెన్ కౌంటర్ నుంచి ఆహారం కోసం కుక్కలు మరొక కుక్కకు సహాయం చేస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ క్రేజీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
కుక్కలు తెలివైన జంతువులు. యజమానుల ప్రాణాలను కాపాడటంలో అవి చూపించే విశ్వాసం మరే జంతువు చూయించదు. కొన్ని వేల సంవత్సరాలుగా మనిషి మనుగడలో కుక్కలు కూడా తోడుగా నడిచాయి. అయితే తాజాగా కుక్కలు ఆహారాన్ని కిచెన్ నుంచి ఎలా దొంగిలించాయో తెలిస్తే నిజమా అని అనుకుంటారు. అయితే కిచన్ లో ఉంచిన ఆహారం కుక్కలకు అందకుండా ఉండటంతో రెండుకుక్కలు నిల్చోగా మూడోకుక్క వాటి మీద ఎక్కి ఆహారాన్ని అందుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కుక్కల తెలివితేటలకు మెచ్చుకుంటున్నారు.
“సమిష్టి కృషి కలలను సాకారం చేస్తుంది. ఈ మూడు కుక్క పిల్లలు ఎప్పుడూ కిచెన్ కౌంటర్ నుంచి అల్పాహారం తీసుకునే పనిలో ఉంటాయి” అని వీడియోతో పాటు పోస్ట్ చేసిన క్యాప్షన్ లో ఉంది. క్లిప్ లో రెండు కుక్కలు వంటగది కౌంటర్ ముందు నిలబడగా వాటి పై ఎక్కిన మరో కుక్క ఆహారాన్ని సంపాదించింది.
ఈ వీడియో ఏప్రిల్ 2న పోస్ట్ చేయబడింది. పోస్ట్ చేసినప్పటి నుంచి వీడియో వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఇది దాదాపు 4.8 మిలియన్ల వీక్షణలను సేకరించింది. సంఖ్యలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా, వీడియోకు అనేక కామెంట్లు వచ్చాయి.
దీనిపై ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఎలా స్పందించారో ఇక్కడ చూద్దాం: ఇది సర్పింగ్ కు సరికొత్త అర్థాన్ని ఇస్తుందని ఓ నెటిజన్ అభిప్రాయపడగా, మరొకతను పైన ఎక్కిన కుక్కకు దాని స్నేహితులు చాలా బాగా సహకరించారు. అని తెలిపారు. తాము ఈ కుక్కలను ప్రేమిస్తున్నామని కొందరు, కుక్కల వ్యూహం చాలా బాగుందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.