SRD: కరెంట్ షాక్ తగిలి మేకపోతు మృతి చెందిన సంఘటన ఖేడ్ మండలం సంజీవనరావుపేటలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేగరీ సాయిలు రోజువారీగా మేకలు మేపుకుంటూ సాయంత్రం వేళ ఇంటికి వెళుతున్నాడు. మార్గమధ్యలో ఓ రైతు పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలకు తగిలి మేక పొట్టేలు మృతి చెందిందని దీని విలువ రూ. 30 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.