ప్రస్తుతం పూజా హెగ్డే మంచి స్టార్ డమ్ అనుభవిస్తోంది. ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులో మహేష్ బాబు SSMB 28తో పాటు పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ కూడా చేస్తోంది. హిందీలో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’, ‘సర్కస్’ సినిమాల్లో నటిస్తోంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అయితే అమ్మడికి ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ప్రభాస్ ‘రాధే శ్యామ్’.. విజయ్ ‘బీస్ట్’.. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాలు హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చాయి. అలాగే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ మధ్యలోనే ఆగిపోయింది. అంతేకాదు ఎఫ్3లో చేసిన ఐటెం సాంగ్ అంతగా పాపులర్ అవలేదు. దాంతో పూజ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. మహేష్-త్రివిక్రమ్ సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ షూటింగ్లో జాయిన్ అవలేదు పూజా.. కానీ త్వరలో స్టార్ట్ కానున్న సెకండ్ షెడ్యూల్లో పాల్గొంటుందని తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలికి గాయం అవడంతో.. రిలాక్స్ మోడ్‌లో ఉంది ముద్దుగుమ్మ. అందుకు సంబంధించిన ఫోటోలను.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తునే ఉంది. ప్రస్తుతం పూజా కోలుకున్నట్టే కనిపిస్తోంది. అయితే రెస్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు.. అమ్మడు బాయ్ ఫ్రెండ్‌తో టైం పాస్ చేసినట్టు.. బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో పూజా ఫలానా హీరోతో షికారు చేస్తుందనే వార్తలొచ్చాయి. కానీ మీడియాకు ఛాన్స్ ఇవ్వలేదు పూజా.. అయితే ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉందనే టాక్ నడుస్తోంది. కాలి గాయంతో బాధపడుతున్న పూజాను దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడట తన బాయ్ ఫ్రెండ్. ఈ ఇద్దరు కలిసి హాస్పిటల్‌కి కూడా వెళ్లినట్టు బాలీవుడ్ రిపోర్ట్. అయితే అతను ఎవరనే విషయంలో క్లారిటీ లేదు. మరి పూజా నిజంగానే ప్రేమలోఉందా!?