హైదరాబాద్(Hyderabad)లోని మాదాపూర్ వద్ద భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. హైటెక్ సిటీ(Hitech city)లోని సైబర్ టవర్స్(Cyber Towers) సమీపంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు చెలరేగడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఫార్చూన్ టవర్స్‌లోని 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతోందన్న సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ(GHMC), డీఆర్ఎఫ్(DRF) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగసి పడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.