HYD: పోలీసు విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండాలని HYD సీపీ సజ్జనార్ అన్నారు. పోలీసు వ్యవస్థ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, విధులు నిర్వర్తించడంలో ఎలాంటి ఒత్తిళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కేసుల విషయంలో బాధ్యతారాహిత్యంగా ప్రదర్శించినా, అవినీతికి ఆస్కారం ఇచ్చిన ఉపేక్షించేది లేదన్నారు.