GNTR: పశ్చిమ నియోజకవర్గం భాగ్యనగర్, వికాస్‌నగర్, ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్ ప్రాంతాల్లో బుధవారం రూ. 2 కోట్ల 66 లక్షల విలువైన రోడ్లు, డ్రైనేజ్, లైటింగ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో అన్ని మౌలిక సదుపాయాలను దశలవారీగా పూర్తి చేస్తున్నామన్నారు.