NZB: బోధన్ MLA సుదర్శన్ రెడ్డిని ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.