KNR: వరి ధాన్యాన్ని మిల్లర్లకు ఎప్పటికప్పుడు పంపించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. రామడుగు మండలం కొత్తపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పర్యటించిన ఆమె రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. వర్షాలు ఉన్న నేపథ్యంలో ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.