ప్రకాశం: విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. ఇందులో భాగంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, డిబేట్ పోటీలలో విజేతలకు మంగళవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో నగదు బహుమతులతో పాటు ప్రశంస పత్రాలను అందచేశారు.