CTR: పుంగనూరుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ఆయన పట్టణ శివారులోని కంపోస్ట్ యార్డును పరిశీలించారు. ఈ మేరకు టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డితో కలిసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.