KMR: భారీ వర్షాలు రైతులపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే వడ్లు కోసి కొద్ది రోజులు గడుస్తుండగా, వరుణుడు విరుచుకుపడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ధాన్యం తడిసి కొన్ని చోట్ల మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. తమ కష్టార్జిత పంటను రక్షించేందుకు రైతులు 24 గంటలు వడ్ల కుప్పల వద్ద కాపలా కాస్తున్నారు.