Malli Pelli:నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli) మూవీ ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నరేష్ (naresh)-పవిత్ర (pavitra) పాల్గొన్నారు. తమ సినిమా కథ ప్రపంచ ఎదుర్కొంటున్న సమస్య అని వివరించారు. సమాజంలో 50 శాతం మంది దంపతులు సంతోషంగా లేరని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
‘పరిస్థితులు, సమాజం వారితో బలవంతంగా కాపురం చేయిస్తున్నాయి. అది చిత్రహింసే.. కొందరు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు వస్తున్నారు. ఇలాంటి వారి కోసం సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మీరు కోరుకున్నట్టు జీవించే హక్కు ఉంది. ఈ సినిమా ఏ ఒక్కరినో ఉద్దేశించి తీసింది కాదు. చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అయినందున అందరూ కనెక్ట్ అవుతున్నారని’ నరేష్ (naresh) తెలిపారు.
మూవీ నరేష్ (naresh) నిజ జీవితం ఆధారంగా రూపొందించినట్టు అనిపిస్తోంది. వీడియోలు రిలీజ్ చేసే సరికి.. నరేష్- పవిత్ర (pavitra) పెళ్లి చేసుకున్నారా అనే సందేహాం కలిగింది. తర్వాత సినిమా అని రివీల్ అయ్యింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో వివాదం ఉన్న సంగతి తెలిసిందే. వారికి విడాకులు మంజూరు కాకపోవడంతో.. నరేష్ (naresh)- పవిత్ర పెళ్లి ఆలస్యం అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.