AP: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌ను వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. ‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా. నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటను దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.