విశాఖ: విశాఖ రైల్వే స్టేషన్లో శనివారం జీఆర్పీ నిర్వహించిన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన సుకుమార్.. రైల్వే స్టేషన్ మీదుగా తిరువళ్లూరుకు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. అతని నుంచి రూ.21,500 విలువైన 4.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.