SRD: నూతనంగా ఏర్పడ్డ ఇంద్రేశం మున్సిపల్ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని శనివారం CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, ఇంద్రేశం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పోచయ్యలు మాట్లాడుతూ.. కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వలేదన్నారు. కార్మికులకు జీతం రూ.26 వేలకు పెంచాలని అన్నారు. ESI, PF కల్పించాలని డిమాండ్ చేశారు.