»Congress High Command To Decide Karnataka Cm Candidate
Karnataka CM:బంతి హైకమాండ్ చేతిలో.. 18వ తేదీన సీఎం ప్రమాణం
కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత కాంగ్రెస్ హై కమాండ్ కోర్టులోకి వచ్చి చేరింది. సీఎం ఎంపిక కోసం పరిశీలకులను పంపిన.. ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఈ రోజు ఢిల్లీ వస్తున్నారని తెలిసింది.
Congress High Command To Decide Karnataka CM Candidate
Karnataka CM:కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. నెక్ట్ స్టెప్ ప్రభుత్వ ఏర్పాటు.. అక్కడే పీఠముడి నెలకొంది. సీఎం అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ఇక్కడ ఇద్దరే పోటీలో ఉన్నారు.. వారిలో ఎవరికీ ఛాన్స్ దక్కనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న సీఎల్పీ సమావేశం జరిగిన.. అభ్యర్థి ఎంపిక మాత్రం కొలిక్కిరాలేదు.
సీఎల్పీ (CLP) సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (kharge) ఓ సూచన చేశారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ (DK Shivakumar) చెరో రెండున్నరేళ్లు సీఎం పదవీ చేపట్టాలని కోరారు. ఇందుకు సిద్ధరామయ్య ఓకే అనగా.. డీకే శివకుమార్ (DK Shivakumar) ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో ఎమ్మెల్యేలు.. మీరే సీఎం అభ్యర్థిని నిర్ణయించాలని కోరారు. దీంతో బంతి హైకమాండ్ వద్దకు చేరింది.
కాంగ్రెస్ పరిశీలకులుగా సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియా వ్యవహరించారు. వారితో ఖర్గే కూడా ఉన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ (DK Shivakumar) ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎంపికపై కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
సిద్ధరామయ్య 9 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2013 నుంచి 2018 వరకు సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో సిద్దరామయ్య మంత్రివర్గంలో డీకే శివకుమార్ (DK Shivakumar) మంత్రిగా చేశారు. డీకే శివకుమార్ కూడా 8 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మంత్రిగా పనిచేశారు.. నేతల ఎంపిక, క్యాంపు రాజకీయాలు.. గాంధీ కుటుంబానికి విధేయుడిగా డీకే శివకుమార్‌కు పేరుంది.
సిద్ధరామయ్య, డీకేలో (DK Shivakumar)ఒకరినీ సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. 18వ తేదీన కర్ణాటక సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.