»Drugs Worth Rs 12 Thousand Crores Seized In Kerala And Jammu And Kashmir
Drugs seized: కేరళ, జమ్మూకశ్మీర్‌లో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సముద్రంలో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2500 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ (Drugs seized) విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
కేరళ, జమ్మూకశ్మీర్‌లలో పోలీసులు భారీగా డ్రగ్స్(Drugs) పట్టుకున్నారు. అరేబియా సముద్రంలో ఇండియన్ ఆర్మీ(Indian army), ఎన్సీబీ(NCB) సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. భారీగా డ్రగ్స్ ను స్వాధీనం(Drugs seized) చేసుకున్నారు. సముద్రంలో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2500 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాకిస్థాన్ వ్యక్తిని నేవీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ (Drugs seized) విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ డ్రగ్స్ ను ఆఫ్ఘనిస్థాన్ నుంచి సముద్ర మార్గంలో తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాక్, ఇరాన్ మీదుగా చిన్న పడవల్లోకి డ్రగ్స్‌ను పంపిణీ చేసుకుంటూ ఆ ఓడ భారత్ కు చేరుతోందని అధికారులు తెలుసుకున్నారు. 134 బస్తాల్లోని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం మూడు పడవల్లో శ్రీలంక, పాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలకు ఈ డ్రగ్స్(Drugs seized) సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. జమ్మూకశ్మీర్ లోని కుప్వారా పరిధిలో కూడా నలుగురు స్మగ్లర్లను ఆర్మీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి 8 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.