‘అవతార్ 2’ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఊహకందని విధంగా ఉంది. ముఖ్యంగా ఇండియాలో నెక్ట్స్ లెవల్లో ఉంది. ఏ ఇండియన్ సినిమాకు కూడా లేనంత భారీ క్రేజ్ ఉంది. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్.. కనీవినీ ఎరుగని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే అవతార్ సీక్వెల్ దాదాపు 13 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతుంది.
‘అవతార్2: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే రిలీజ్‌కి మూడు వారాల ముందే బుకింగ్స్ స్టార్ట్ చేయడం విశేషం. కానీ కొన్ని చోట్ల మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇక అవతార్ టికెట్స్ హాట్ కేకుల్లా ఎగిరిపోతున్నాయి. టికెట్ రేట్లు భారీగా ఉన్నా.. మూడు రోజుల్లో ఏకంగా 15 వేలకు పైగా ప్రీమియం టికెట్లు అమ్ముడయ్యాయి.
అది కూడా ఐదారు రోజుల వరకు బుక్ అయ్యాయి. హైదరాబాద్‌లో రెండు మల్టీప్లెక్సుల్లో వీకెండ్ మొత్తానికి టికెట్లు సోల్డ్ ఔట్ అయ్యాయి. ఈ లెక్కన అవతార్2 టికెట్ దొరకడం కష్టంగా మారిందంటున్నారు నెటిజన్స్. దాంతో మరిన్ని స్క్రీన్స్ పెరుగనున్నాయి. అయితే అడ్వాన్స్‌కే ఇలా ఉంటే.. సాధారణ బుకింగ్స్ మొదలైతే భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని మల్టీప్లెక్స్ యాజమాన్యం చెబుతోంది.
దాంతో బుకింగ్స్ పరంగా అవతార్ 2.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. అందుకే ఒక్క తెలుగు మార్కెట్లోనే 100 కోట్ల బిజినెస్ జరగునుందని టాక్. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ డాలర్ టార్గెట్‌తో బరిలోకి దిగబోతోంది. మరి వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర అవతార్2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.