భాగ్యనగరంలో నేడు అద్భుతం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలప్పుడు నీడ మాయం అయ్యింది. జీరో షాడో(Zero Shadow) ఏర్పడటంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ టైంలో ఎండలో నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఏ వస్తువును ఉంచినా కూడా వాటి నీడ అనేది 2 నిమిషాల పాటు కనిపించలేదు. 12:12 గంటల నుంచి 12:14 వరకూ కూడా నీడ(Shadow) కనిపించకుండా పోయింది. ఈ అరుదైన సంఘటనను చూసి నగర ప్రజలు ప్రత్యేక అనుభూతి చెందుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad)లోని బిర్లా టెంపుల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు(Scientists) జీరో షాడో డే (Zero shadow Day) గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఖగోళ అద్భుతంపై ప్రజలకు పలు విషయాలను తెలియజేశారు. సూర్యుని నుంచి నిట్టనిలువుగా కిరణాలు(Sun Rises) పడటం వల్ల నీడ మాయం అవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
ప్రతి ఏడాది కూడా రెండుసార్లు ఈ అద్భుతం జరుగుతుందని శాస్త్రవేత్తలు(Scientists) చెబుతున్నారు. హైదరాబాద్(Hyderabad) ప్రజలు మరోసారి ఇటువంటి అద్భుతాన్ని చూసే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఆగస్టు 3వ తేదిన కూడా హైదరాబాద్లో జీరో షాడో డే (Zero shadow Day) ఏర్పడుతుందని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు వెల్లడించారు. ఈ మధ్యనే బెంగళూరులో కూడా ఈ ఖగోళ అద్భుతం కనిపించింది. ఏప్రిల్ 25వ తేదిన మధ్యాహ్నం 12:17 గంటల సమయంలో రెండు నిమిషాల పాటు నీడ మాయం అయ్యింది. నిటారుగా ఉన్న ఏ వస్తువు నీడ కూడా కనిపించలేదు. తాజాగా నేడు జీరో షాడో డే(Zero shadow Day) కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.