పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాకిస్తాన్ ఆర్మీ మంగళవారం అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అవినీతి కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ కారును చుట్టుముట్టారని ఖాన్ సహాయకుడు ఫవాద్ చౌదరి అతని అరెస్టు గురించి చెప్పారు. అయితే నివేదికను ధృవీకరించాలని కోరుతూ వార్తా సంస్థ రాయిటర్స్ అభ్యర్థనపై సమాచార మంత్రి మర్రియం ఔరంగజేబ్ వెంటనే స్పందించలేదు.
మరోవైపు 70 ఏళ్ల ఖాన్‌ను రేంజర్లు కోర్టు లోపల నుంచి అపహరించారని మరో PTI నాయకుడు అజరు మశ్వాని ఆరోపించారు. తక్షణమే దేశంలో నిరసనలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చిందన్నారు.
వారు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌ను హింసిస్తున్నారని, ఖాన్ సాహిబ్‌ను కొడుతున్నారని అన్నారు. ఖాన్ సాహిబ్‌ను వారు ఏదో చేశారని చీమా పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో తెలిపింది.
#WATCH | Latest visuals from Islamabad High Court, Pakistan show heavy deployment of security officials