TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మంగళవారం తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా చట్టం & శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజా భద్రతా చర్యలు, ప్రజా సంక్షేమ అంశాలపై చర్చించారు. పోలీస్ విభాగం చేపడుతున్న ప్రజా సేవలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ మేరకు ప్రజల భద్రత కోసం మరింత సమర్థవంతమైన చర్యలు కొనసాగించాలని సూచించారు.