CTR: పులిచెర్ల(M) పాలెంపంచాయితీలో మంగళవారం వేకువ జామున పంటలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేయడంతో కొబ్బరి, మామిడి చెట్లకు నష్టం వాటిల్లింది. పంచాయతీ పరిధిలోని కొంగర వారిపల్లి వద్దకు చేరుకున్న ఒంటరి ఏనుగు మునిరత్నం నాయుడు, సురేందర్ నాయుడుకు చెందిన కొబ్బరి, మామిడి చెట్లను ధ్వంసం చేసింది. అనంతరం ఏనుగు తిరిగి వచ్చిన దారిలోనే అడవులకు చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు.