SRD: వారంలో మూడు రోజులు సదరం శిబిరాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం శిబిరాన్ని మంగళవారం పరిశీలించారు. ప్రతి శిబిరంలో 100 మంది వికలాంగులకు పరీక్షలు చేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.