WGL: ఖానాపూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాల ఇందిరమ్మ లబ్ధిదారులకు మంగళవారం కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేదల అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.