TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు అడిగిన సమాచారం.. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవ్వాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారమివ్వాలని పేర్కొంది. యూజర్, పాస్వర్డ్ సమాచారం ఇవ్వాలని జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సూచించింది.