GNTR: తెనాలిలోని చెంచుపేటలో దారుణ హత్య జరిగింది. కైలాష్ భవన్ రోడ్డులో మంగళవారం టిఫిన్ కోసం వచ్చిన జూటూరు బుజ్జి (50)ని స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి కొబ్బరికాయల కత్తితో నరికి హత్య చేశాడు. త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన హత్య స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.