E.G: గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో ప్రసిద్ధ శ్రీరామ గిరి క్షేత్ర ప్రాంగణంలో నూతనంగా నిర్మితమవుతున్న పుష్కరిణి పనులు చివరి దశకు చేరుకున్నాయి. నవంబర్ 2వ తేదీన పుష్కరిణి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి రామానుజ చిన్న జీయర్ స్వామి, అహోబిలం చిన్న జీయర్ స్వామిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.