KNR: కరీంనగర్ టౌన్ డివిజన్లోని కొరియర్ ఆఫీసులు, కార్గో సెంటర్లలో సోమవారం పోలీస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ స్వయంగా బస్టాండ్, ఆర్టీసీ కార్గో కార్యాలయాలను పర్యవేక్షించారు. అనుమానాస్పద కార్యకలాపాల గురించి ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు.