SRPT- అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నీళ్ల పాలయ్యాయి. కోదాడ మండల వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున వరి సాగు చేయగా పంట చేతికి రావడంతో విక్రయించేందుకు కళ్లాల్లో ఆరబెట్టారు. అకాల వర్షంతో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.