JGL: మల్యాల మండలంలోని రాజారం గ్రామంలో సోమవారం గుర్రం సుమలత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నాలుగు నెలల క్రితం భర్త దుబాయ్ వెళ్లగా, అత్తమామలు, ఆడబిడ్డలు, మరో వ్యక్తి వేధింపుల కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరి పెట్టి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.