MNCL: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకో బజార్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కిషన్ ఓజా తెలిపారు. భారత పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ,నేషనల్ గ్రీన్ కోర్ పర్యావరణ విద్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 16న ఏకో బజార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యార్థులు పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, స్థానిక స్వదేశీ వస్తువులను ప్రదర్శిస్తారు.