KMM: ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తల్లాడ మండలంలో చోటుచేసుకుంది. మల్సూరు తండా గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (19) నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.