NZB: చలికాలం సమీపించిన నేపథ్యంలో విధి నిర్వహణలో పోలీసులకు ఉపయుక్తంగా ఉండే ఉలెన్ జాకెట్స్, హావర్ సాక్స్లను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అందజేశారు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏఆర్, సివిల్ పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ అందజేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సుమన్ పాల్గొన్నారు.