MBNR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘనవిజయమని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సీసీ కుంట మండల పరిధిలోని అమ్మపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరారు.