CTR: సోమల మండలం అనెమ్మ గారి పల్లి గ్రామం చెందిన బోయకొండయ్యను సోమవారం అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. సాదారణ తనిఖీలో బాగంగా అతని వద్ద నాటు తుపాకీ లభ్యమైంది. నాటు తుపాకీతో పాటు ద్విచక్ర వాహనంను విధుల్లో వున్న అటవీ శాఖ ఉద్యోగి స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరు అటవీ రేంజర్ అధికారి శ్రీరాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.