MHBD: కేసముద్రం మండలంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన మొక్కజొన్న రాశులు తడిసి ముద్దయ్యాయి. సమాచారం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి సోమవారం తడిసిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.